<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>90</hymn_number>
<lyrics>[C1]
   నేనే ప్రభువా నిన్నప్పగించేది -
   నేనే ప్రభువా నిన్నమ్ము కొనేది
   రొట్టెలా విరిచి నీరక్తముతో కడిగి
   పంచి పెట్టునన్ను నీ సాక్షిగా

[V1]
 నా చూపులో నా మాటలో
 నీ ముఖాన ఉమ్ములు పడుతున్నాయి
 నా తలపులో నా ఆలోచనలో
 నీ తల పై ముళ్ళు గుచ్చుకున్నవి

[V2]
 నా వ్రాతలో నా చేతిలో
 నీకు మేకులు దిగబడుతున్నాయి
 నా నడకలో నా పడకలో
 నిన్ను సిలువ కట్టి తోస్తున్నవి</lyrics>
<title>నేనే ప్రభువా నిన్నప్పగించే</title>
</song>